ఎమ్మెల్సీ పోచంపల్లి
వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు, బాటసారుల సౌకర్యార్థం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఆశాల టోల్‌గేట్ సమీపంలో, మాజీ ఎంపీపీ స్వర్గీయ బొల్లం బిక్షపతి స్మారకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జనగామ జిల్లా మాజీ జడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు బొల్లం అజయ్ మణికంఠతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. మాజీ ఎంపీపీ భిక్షపతి అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడేలా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన బొల్లం కుటుంబాన్ని అభినందించారు. బొల్లం అజయ్ మణికంఠ మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల కోసం ఈ తాగునీటి సౌకర్యాన్ని కల్పించామని, త్వరలో భిక్షపతి పేరుతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ముసుపట్ల విజయ్, మండల యూత్ అధ్యక్షులు దుబ్బాక హరీష్ గౌడ్, వెల్ది ఉపసర్పంచ్ ఎడ్ల బాలరాజ్, బాల్నే పరుశురాం, పేర్ని ప్రసాద్, పేర్ని లెనిన్, కరీంకొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
