బాటసారుల దాహార్తిని తీర్చడం అభినందనీయం
ఎమ్మెల్సీ పోచంపల్లి వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు, బాటసారుల సౌకర్యార్థం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఆశాల టోల్‌గేట్ సమీపంలో, మాజీ ఎంపీపీ స్వర్గీయ బొల్లం బిక్షపతి స్మారకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జనగామ జిల్లా మాజీ జడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు బొల్లం అజయ్ మణికంఠతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. మాజీ ఎంపీపీ...