WarangalVoice
Newspaper Banner
Date of Publish : 14 April 2026, 1:56 pm Digital Edition : Ravi Goli

బాధిత కుటుంబానికి పరామర్శ

వరంగల్ వాయిస్, పరకాల: హనుమకొండలోని ప్రముఖ వ్యాపారవేత్త గొట్టిముక్కుల కేశవరావు మాతృమూర్తి గొట్టిముక్కల తిరుపతమ్మ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, మంగళవారం పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, మున్సిపల్ మాజీ చైర్మన్ సోదా రామకృష్ణ వారి నివాసానికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. కేశవరావు నివాసానికి చేరుకున్న సోదా రామకృష్ణ బృందం, తిరుపతమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేశవరావును, వారి కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ పరామర్శలో సోదా రామకృష్ణతో పాటు పరకాల మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు నల్లెల అనిల్ కుమార్, బండి సదానందం గౌడ్, ఏకు రాజు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.