బాల్యవివాహాలతోనే తరాల మధ్య పేదరికం
కుడా చైర్ పర్సన్ గుండు సుధారాణి వరంగల్ వాయిస్, రామన్నపేట : చిన్న వయసులో వివాహాలు జరగడం వల్లే సమాజంలో తరాల మధ్య పేదరికం కొనసాగుతోందని, మహిళలు అట్టడుగు స్థాయిలోనే ఉండిపోవడానికి ఇవే ప్రధాన కారణమని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్ పర్సన్ గుండు సుధారాణి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం రామన్నపేటలోని క్యాంపు కార్యాలయంలో సీనియర్ వైద్యులు డాక్టర్ ఆడెపు రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన సామాజిక చైతన్య సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సుధారాణి.. బాల్యవివాహాల నివారణకై రూపొందించిన...