బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

వరంగల్ వాయిస్, దామెర : మండల పరిధిలోని పసరగొండ క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. ముందు వెళ్తున్న ఆటో డ్రైవర్ ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా అకస్మాత్తుగా బ్రేక్ వేయడమే ఈ ప్రమాదానికి కారణమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామెర మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పెండ్లి అనుదీప్ (18) మంగళవారం తన మిత్రుడు హరీష్‌తో కలిసి బైక్‌పై హనుమకొండకు బయలుదేరాడు. ఈ క్రమంలో బైక్ పసరగొండ క్రాస్ రోడ్డు...