వంగరి కాంతమ్మ-రాజమౌళి జ్ఞాపకార్థం వితరణ
వరంగల్ వాయిస్, కాశిబుగ్గ : పితృ (మహాలయ) అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని కాశీబుగ్గ సెంటర్ వద్ద శనివారం వికే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత బ్రెడ్ మరియు వాటర్ బాటిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. కీర్తిశేషులు వంగరి కాంతమ్మ – రాజమౌళిల జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ ప్రతినిధులు ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దేవలపల్లి రాజేశ్వరరావు, రాజేశ్వరి హాజరై, కాశీబుగ్గ చౌరస్తాలోని చిరు వ్యాపారులకు, స్థానిక ప్రజలకు, పాదచారులకు బ్రెడ్ పాకెట్లు, తాగునీటి బాటిళ్లను స్వయంగా అందజేశారు. పితృ దేవతల స్మరణార్థం ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అతిథులు కొనియాడారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రతినిధులు ముఖ్య అతిథులను పొన్నాడలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సేవా కార్యక్రమంలో వికే ఫౌండేషన్ అధ్యక్షుడు వంగరి రవి, ఉపాధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, సభ్యులు శ్రీజ, రాజా, రాజ్ కమల్, అభిరాజ్, అమృత లక్ష్మి, వంగరి కుటుంబ సభ్యులు, ఫౌండేషన్ నిర్వాహకులు పాల్గొన్నారు.