WarangalVoice
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 2:57 pm Digital Edition : Ravi Goli

భద్రకాళి కళ్యాణ మహోత్సవంలో పద్మశాలీల సందడి

వరంగల్ వాయిస్, హనుమకొండ : చారిత్రక శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని, సోమవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల పద్మశాలి కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ఈగ మల్లేశం గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కుల బంధువులంతా ఏకమై ఉత్సవాలను విజయవంతం చేశారు. ఈ వేడుకల్లో హనుమకొండ రెడ్డి కాలనీ (4వ డివిజన్) కు చెందిన “శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం” క్రియాశీలక పాత్ర పోషించింది. సంఘం అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు సారధ్యంలో, ప్రధాన కార్యదర్శి గుఱ్ఱపు రమేష్ తో పాటు పెద్ద సంఖ్యలో కార్యవర్గ సభ్యులు, ప్రాథమిక సభ్యులు ఉత్సవానికి తరలివచ్చారు. బచ్చు ఆనందం, కుసుమ శ్యాంసుందర్, బింగి సతీష్ వంటి ప్రముఖులు కూడా ఇందులో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యవర్గ సభ్యులు దుంపేటి నరేందర్ బాబు, నరేట్ల మహేందర్, గోరంట్ల రాజు, బత్తుల మహేందర్, గంజి రాజేందర్, చెన్నూరి రాజు, కూరపాటి శ్రీనివాస్, దుంపేటి నవీన్, కొంగ సారంగపాణి, లింగబత్తుల సత్తయ్య, తేరాల శ్రీధర్, కోమాకుల కుమార్ స్వామి, కందగట్ల నరేష్, ప్రాథమిక సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.