భద్రకాళి కళ్యాణ మహోత్సవంలో పద్మశాలీల సందడి

వరంగల్ వాయిస్, హనుమకొండ : చారిత్రక శ్రీ భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ మహోత్సవాలను పురస్కరించుకుని, సోమవారం హనుమకొండ, వరంగల్ జిల్లాల పద్మశాలి కుల బాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ ఈగ మల్లేశం గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కుల బంధువులంతా ఏకమై ఉత్సవాలను విజయవంతం చేశారు. ఈ వేడుకల్లో హనుమకొండ రెడ్డి కాలనీ (4వ డివిజన్) కు చెందిన “శ్రీ భక్త మార్కండేయ పద్మశాలి సంక్షేమ సంఘం” క్రియాశీలక పాత్ర పోషించింది. సంఘం అధ్యక్షులు బత్తుల...