భూముల రీ-సర్వేకు ప్రజలంతా సహకరించాలి
దామెర తహసీల్దార్ జ్యోతి వరలక్ష్మి దేవి వరంగల్ వాయిస్, దామెర : భూ సమస్యలు పూర్తిగా తలెత్తకుండా గ్రామాల్లో భూములను అత్యంత పారదర్శకంగా రీ-సర్వే చేస్తున్నామని, గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో అధికారులకు సహకరించాలని దామెర ఎమ్మార్వో జ్యోతి వరలక్ష్మి దేవి పిలుపునిచ్చారు. బుధవారం దామెర మండలంలోని ఓగులాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ కేతిపెళ్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామంలోని 340 సర్వే నంబర్ల పరిధిలోని 1,197 ఎకరాల భూమిని అంగుళం భూమి కూడా...