మడికొండ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన సీపీ

వరంగల్ వాయిస్, క్రైం :సెంట్రల్ జోన్ పరిధిలోని మడికొండ పోలీస్ స్టేషన్‌ను వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఐపీఎస్ శుక్రవారం సందర్శించారు. ఉదయం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న పోలీస్ కమిషనర్‌కు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ పుల్యాల కిషన్ పూల మొక్కను అందజేశారు.అనంతరం పోలీస్ కమిషనర్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరును పరిశీలించడంతో పాటు, స్టేషన్‌కు సంబంధించిన పలు రికార్డులను తనిఖీ చేశారు. స్టేషన్ పరిధిలో తరచుగా అధిక సంఖ్యలో నమోదవుతున్న నేరాలు, పరిధిలోని గ్రామాలు, ఆయా గ్రామాల్లో...