WarangalVoice
Newspaper Banner
Date of Publish : 15 August 2026, 1:29 pm Digital Edition : Ravi Goli

‘మన హక్కులు.. మన భవిష్యత్’ అంటూ రైట్స్ వాక్

వరంగల్ వాయిస్,హనుమకొండ: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ‘మన హక్కులు.. మన భవిష్యత్’ నినాదంతో రైట్ టు ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో శనివారం భారీ రైట్స్ వాక్ ను హనుమకొండ ఏకశిల పార్క్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుగ్గంపూడి రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం సమానంగా అందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం సాధించినట్లు అవుతుందని అన్నారు. విద్య, వైద్యం, సమానత్వం ప్రతి పౌరుడి హక్కులని పేర్కొన్నారు.యువత చెడు మార్గాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని, కష్టపడి చదివి తల్లిదండ్రులు గర్వపడే స్థాయికి ఎదగాలని రంజిత్ రెడ్డి సూచించారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.ర్యాలీలో పాల్గొన్న యువత ‘విద్య, వైద్యం, సమానత్వం ప్రతి పౌరుడి హక్కు’ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సుమారు 200 మీటర్ల పొడవైన జాతీయ జెండాను ప్రదర్శిస్తూ దేశభక్తిని చాటారు. ఏకశిల పార్క్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ ఉత్సాహంగా కొనసాగింది.ఈ ర్యాలీలో యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.