‘మన హక్కులు.. మన భవిష్యత్’ అంటూ రైట్స్ వాక్

వరంగల్ వాయిస్,హనుమకొండ: 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా ‘మన హక్కులు.. మన భవిష్యత్’ నినాదంతో రైట్ టు ఇండిపెండెన్స్ మూవ్‌మెంట్ ఆధ్వర్యంలో శనివారం భారీ రైట్స్ వాక్ ను హనుమకొండ ఏకశిల పార్క్ నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దుగ్గంపూడి రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రతి ఒక్కరికీ విద్య, వైద్యం సమానంగా అందినప్పుడే నిజమైన స్వాతంత్య్రం సాధించినట్లు అవుతుందని అన్నారు. విద్య, వైద్యం, సమానత్వం ప్రతి...