WarangalVoice
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 4:25 pm Digital Edition : Ravi Goli

మల్లక్క మృతదేహానికి బీఆర్ఎస్ నేత గజ్జి శంకర్ నివాళి

వరంగల్ వాయిస్, శాయంపేట : మండలంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన దివ్యాంగురాలు రేనుకుంట్ల మల్లక్క గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లి దివ్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జి శంకర్ వెంటనే గ్రామానికి చేరుకుని మల్లక్క పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తల్లి దివ్యాంగుల సేవా సమితి మండల అధ్యక్షుడు ఎర్ర తిరుపతి రెడ్డి, మండల వైస్ ప్రెసిడెంట్ మంద రాజు, ప్రధాన కార్యదర్శి తడక సంతోష్ గౌడ్, పెద్దకోడెపాక గ్రామ అధ్యక్షుడు అబ్బు తిరుపతిరెడ్డి, ఇంచార్జి అధ్యక్షులు శంకర్ లింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిల శ్రీకాంత్, గ్రామ మాజీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు చింతల రమేష్ తదితరులు పాల్గొన్నారు.