మల్లక్క మృతదేహానికి బీఆర్ఎస్ నేత గజ్జి శంకర్ నివాళి
వరంగల్ వాయిస్, శాయంపేట : మండలంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన దివ్యాంగురాలు రేనుకుంట్ల మల్లక్క గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఈ విషయాన్ని తెలుసుకున్న తల్లి దివ్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గజ్జి శంకర్ వెంటనే గ్రామానికి చేరుకుని మల్లక్క పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో తల్లి దివ్యాంగుల సేవా సమితి మండల అధ్యక్షుడు ఎర్ర...