మహిళలు తమ కాళ్ల మీద తాము నిలబడాలి
'శిఖర' గ్రాడ్యుయేషన్ డేలో వక్తలు మహిళలకు సర్టిఫికెట్ల ప్రదానం వరంగల్ వాయిస్, హనుమకొండ : యువత, మహిళల్లో వృత్తి నైపుణ్యాలను పెంపొందించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన "శిఖర స్కిల్ సెంటర్" మొదటి బ్యాచ్ విజయవంతంగా పూర్తయింది. హన్మకొండ హరిత హోటల్‌లో శనివారం నిర్వహించిన "గ్రాడ్యుయేషన్ డే" వేడుకలో టైలరింగ్, బ్యూటీషియన్, మగ్గం విభాగాల్లో శిక్షణ పొందిన 260 మంది మహిళలకు అతిథులు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి...