మహిళా ఆత్మగౌరవానికి సరికొత్త అధ్యాయం
ల్యాదల్లలో ‘రుద్రమ’ బ్రాండ్ ఘన ప్రారంభం వరంగల్ వాయిస్, దామెర : తెలంగాణ మహిళల ఆర్థిక స్వావలంబన, ఆత్మగౌరవానికి ప్రతీకగా దామెర మండలం ల్యాదేళ్ల గ్రామం సరికొత్త చరిత్రకు వేదికైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న 'మహిళా శక్తి' వారోత్సవాల సందర్భంగా.. ల్యాదేళ్లలో ఏర్పాటు చేసిన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, పరకాల స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ మినీ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌ను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి, ‘వీ హబ్’ సీఈవో సీతా పల్లాచోళ్లతో కలిసి ఆదివారం ఘనంగా ప్రారంభించారు. అనంతరం రూ.కోట్ల వ్యయంతో...