మహిళా కానిస్టేబుల్ సంగీత ఆత్మహత్య!
తోటి కానిస్టేబుల్ వేధింపులే కారణమని సూసైడ్ నోట్ అత్తగారింట్లో ఉరివేసుకుని బలవన్మరణం నిందితుడు శ్రీధర్‌పై కేసు నమోదు మట్టెవాడ పోలీసుల దర్యాప్తు వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ నగరంలోని మట్టెవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విధి నిర్వహణలో ఉంటూ ఇతరులకు ధైర్యాన్ని చెప్పాల్సిన ఓ మహిళా కానిస్టేబుల్, తోటి ఉద్యోగి వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడింది. మట్టెవాడలోని తన అత్తగారింట్లో సంగీత (33) ఉరివేసుకుని ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా కలకలం రేపింది. బాధితురాలు సంగీత ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి...