మహిళా పోలీసుల ఐక్యతను బలోపేతం చేయడమే లక్ష్యం : వరంగల్ సీపీ శ్వేత
మహిళా పోలీసుల ఆత్మీయ సమ్మేళనం… వరంగల్ వాయిస్, క్రైమ్ :వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా పోలీసు అధికారులు, సిబ్బందికి శనివారం భీమారంలోని శుభం ఫంక్షన్ హాల్లో పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత, ఐపీఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో హోంగార్డుల నుంచి ఉన్నతాధికారుల వరకు సుమారు 360 మంది పాల్గొన్నారు.ఈ సందర్భంగా వరంగల్ సీపీ శ్వేత మాట్లాడుతూ.. కుటుంబ బాధ్యతలతో పాటు పోలీస్ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్న మహిళా సిబ్బంది శాఖకు మంచి పేరు తీసుకువస్తున్నారని ప్రశంసించారు. మహిళా పోలీసుల ఐక్యతను...