మానవత్వాన్ని చాటుకున్న కౌన్సిలర్ పూర్ణ చారి

వరంగల్ వాయిస్, నడికూడ : కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడంలోనే అసలైన మానవత్వం ఉందని పరకాల మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణ చారి అన్నారు. నడికూడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన పద్మశాలి కుల బంధువు కాంబత్తుల సాంబయ్య ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఈ విషయం తెలుసుకున్న పూర్ణ చారి బుధవారం బాధిత కుటుంబాన్ని స్వయంగా పరామర్శించారు. సాంబయ్య మృతితో ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలుసుకున్న కౌన్సిలర్, వారికి తక్షణ సాయంగా 50 కిలోల బియ్యం...