ముగిసిన 45వ రాష్ట్రస్థాయి షూటింగ్‌బాల్ ఛాంపియన్‌షిప్
విజేతగా నిలిచిన నాగర్‌కర్నూల్ జట్టు వరంగల్ వాయిస్, పర్వతగిరి : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం పల్లవి మోడల్ స్కూల్ వేదికగా మూడు రోజుల పాటు ఉత్సాహభరితంగా సాగిన 45వ రాష్ట్రస్థాయి బాలికల షూటింగ్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలు నవంబర్ 16తో విజయవంతంగా ముగిశాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి ఉత్సాహంగా క్రీడాకారులు పాల్గొన్న ఈ టోర్నమెంట్‌లో నాగర్‌కర్నూల్ జట్టు అగ్రస్థానాన్ని కైవసం చేసుకోగా, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు వెల్లువెత్తాయి. నవంబర్ 14 నుంచి 16 వరకు జరిగిన ఈ...