మూడు గంటల్లోనే మిస్సింగ్ కేసు సుఖాంతం
బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన దామెర ఎస్సై వరంగల్ వాయిస్, దామెర : దామెర పోలీసులు మెరుపు వేగంతో స్పందించి ఒక మిస్సింగ్ కేసును కేవలం మూడు గంటల్లోనే ఛేదించారు. అదృశ్యమైన 13 ఏళ్ల బాలికను సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించి తమ మానవత్వాన్ని, వృత్తి నిబద్ధతను చాటుకున్నారు. శనివారం దామెర మండలానికి చెందిన చాపర్తి సతీష్ కుమార్తె సాత్విక (13) అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న దామెర ఎస్సై కొంక అశోక్, వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశారు....