మూడేళ్ల నిరాధరణకు ముగింపు

బాబాసాహెబ్ విగ్రహ సుందరీకరణకు శంకుస్థాపన (మహాదేవపూర్ - వరంగల్ వాయిస్): జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని అన్నారం కూడలి వద్ద మూడేళ్లుగా నిరాధరణకు గురవుతున్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. మంగళవారం బాబాసాహెబ్ 135వ జయంతిని పురస్కరించుకొని బహుజనసేన ఆధ్వర్యంలో విగ్రహ సుందరీకరణ పనులకు ఘనంగా శంకుస్థాపన చేశారు. కాళేశ్వరం ప్రధాన రహదారి అన్నారం కూడలిలో మూడేళ్ల క్రితం అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసినప్పటికీ, సరైన పర్యవేక్షణ లేక అగౌరవంగా ఉందనే ఉద్దేశంతో బహుజనసేన ఈ నిర్ణయం తీసుకుంది....