మూడో కన్ను – భద్రతకు దన్ను

దామెర ఎస్సై కొంక అశోక్ దొంగతనాల నివారణకు సీసీ కెమెరాలే రక్షణ కవచం వరంగల్ వాయిస్, దామెర : ప్రజల ఆస్తిపాస్తుల రక్షణకు, నేరాల అదుపునకు 'మూడో కన్ను'గా పిలవబడే సీసీ కెమెరాలు ఎంతగానో ఉపయోగపడతాయని దామెర ఎస్సై కొంక అశోక్ అన్నారు. శుక్రవారం దామెర పోలీస్ స్టేషన్ పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, గ్రామస్తులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇటీవల కాలంలో దొంగతనాలు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సీసీ కెమెరాల ఆవశ్యకతను వారికి వివరించారు. ఈ సందర్భంగా...