WarangalVoice
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 3:49 pm Digital Edition : Ravi Goli

మృతుడి కుటుంబానికి నిత్యావసరాల పంపిణీ

వరంగల్ వాయిస్, పరకాల : కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలుస్తూ పరకాల 9వ వార్డు కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణాచారి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. పట్టణంలోని 4వ వార్డు పరిధిలో ఇటీవల అలిసెరి స్వామి మరణించగా, విషయం తెలుసుకున్న పూర్ణాచారి శనివారం వారి కుటుంబాన్ని పరామర్శించి  మృతుడి కుటుంబానికి బియ్యం, కిరాణా సామాగ్రిని అందజేశారు.  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి మేఘనాథ్, పార్టీ నాయకులు దాసరి రవి, కందికొండ జస్వంత్, మాస రాజేందర్, దేవరకొండ శేఖర్ పాల్గొన్నారు.