రాంపెల్లి లింగమూర్తికి “పద్మ శ్రీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు”

వరంగల్ వాయిస్, నర్సంపేట : వరంగల్ మట్టిలో పుట్టిన ప్రతిభ జాతీయ స్థాయిలో మెరిసింది. డిజిటల్ మీడియా, జర్నలిజం రంగాల్లో నిబద్ధతతో పనిచేస్తూ సమాజంపై చెరగని ముద్ర వేసిన ప్రముఖ జర్నలిస్ట్ రాంపెల్లి లింగమూర్తికి ప్రతిష్టాత్మకమైన “పద్మ శ్రీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డు 2026” వరించింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌కు చెందిన జివ్రాన్ ఫౌండేషన్ వారు దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన వారిని గుర్తించి ఈ గౌరవాన్ని అందజేశారు. ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం, నిష్పక్షపాత వార్తా సేకరణ, డిజిటల్ మీడియాలో వినూత్న...