రాజకీయాల్లోకి ‘కవితక్క’ కొత్త పార్టీ
వేములవాడలో పోస్టర్ ఆవిష్కరణ 25న మేడ్చల్‌లో లక్ష మందితో భారీ బహిరంగ సభ జాగృతి శ్రేణుల ఆధ్వర్యంలో ‘ఆవిర్భావ’ సన్నాహాలు వరంగల్ వాయిస్, వేములవాడ : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం పార్టీ ఆవిర్భావానికి సంబంధించిన పోస్టర్‌ను జాగృతి నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. నియోజకవర్గ ఇన్‌చార్జ్ నూనె మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు వర్ధ సతీష్ కుమార్...