రేపే ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవనానికి భూమిపూజ
ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి భారీగా తరలిరావాలని ఆర్యవైశ్య సంఘం పిలుపు వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న నూతన భవన నిర్మాణాలకు నేడు శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరగనుంది. సెప్టెంబర్ 13 ఉదయం 10:30 గంటలకు ఈ భూమిపూజ మరియు ఫౌండేషన్ స్టోన్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ చారిత్రక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి భవన నిర్మాణాలకు...