రేవంత్ రెడ్డి.. ఆడబిడ్డలతో ఆటలా..?
కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ధర్నా.. పాల్గొన్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి,మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్.. వరంగల్ వాయిస్,హనుమకొండ: పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆధ్వర్యంలో సోమవారం హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ర్యాలీ అనంతరం...