రోడ్డు ప్రమాదాలపై ‘మాక్ డ్రిల్’
వరంగల్ వాయిస్, లింగాలఘన్‌పూర్ (రఘునాథపల్లి) : రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం లింగాలఘన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెల్లూట్ల జాతీయ రహదారిపై భారీ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వెస్ట్ జోన్ డీసీపీ, జనగామ ఏఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ సదస్సులో వాహనదారులు, స్థానికులకు రోడ్డు భద్రతపై కీలక సూచనలు చేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా పోలీసులు ఒక నమూనా ప్రమాద దృశ్యాన్ని (మాక్ డ్రిల్) ఏర్పాటు చేసి, ప్రమాదం జరిగిన వెంటనే స్పందించే...