రోడ్డు ప్రమాద బాధితులకు అండగా దామెర ఎస్సై అశోక్

వరంగల్ వాయిస్, దామెర : మండల పరిధిలోని ఓలాపూర్ శివారులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పవర్ గ్రిడ్ సమీపంలో ఊరుగొండ వైపు వెళ్తున్న ఒక ఆటోను, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న దామెర ఎస్సై కొంక అశోక్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుల పరిస్థితిని గమనించిన ఆయన,...