రోడ్డు ప్రమాద స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీపీ

వరంగల్ వాయిస్, క్రైం : రోడ్డు ప్రమాదాలకు గల ప్రధాన కారణాలను గుర్తించి, భవిష్యత్తులో ప్రమాదాలను నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత ఐపీఎస్ సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై 14 ప్రాంతాలను, వరంగల్- కరీంనగర్ జాతీయ రహదారిపై 8 ప్రాంతాలను ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించి పరిశీలించారు. ఆధికారిక లెక్కల ప్రకారం గడిచిన మూడు సంవత్సరాలలో వరంగల్ కమిషనరేట్ పరిదిలో వరంగల్-ఖమ్మం జాతీయ రహదారి లో 108 రోడ్డు ప్రమాదాలు జరిగి, అందులో 80...