వంగపహాడ్‌లో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు…
ఆకట్టుకున్న అంగన్‌వాడీ చిన్నారుల దేశభక్తి ప్రదర్శనలు... వరంగల్ వాయిస్, హాసన్ పర్తి : గ్రేటర్ వరంగల్ 2వ డివిజన్ పరిధిలోని వంగపహాడ్‌లో గడవంశీయ కులం ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుల పెద్దమనిషి ముస్కు వీరేశం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా అంగన్‌వాడీ చిన్నారుల ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని దేశభక్తిని...