WarangalVoice
Newspaper Banner
Date of Publish : 02 May 2026, 10:22 am Digital Edition : Ravi Goli

వడదెబ్బతో వ్యక్తి మృతి

వరంగల్ వాయిస్, గణపురం: మండల కేంద్రానికి చెందిన ముఖ్యర శ్రీనివాస్ గౌడ్ (45) కూలి పనికి వెళ్లి వడదెబ్బకు గురై మృతిచెందారు. గురువారం ఉదయం కూలి పని చేస్తుండగా ఒక్కసారిగా వడదెబ్బకు గురై కుప్పకూలిపోవడంతో  వెంటనే తోటి కూలీలు భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హనుమకొండ ఎంజీఎం ఆసుపత్రికి రెఫర్ చేయగా ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడి నుంచి వారు ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లమన్నారు. ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.