వరంగల్‌లో ‘గుడ్ ఇయర్’ కొత్త ఈగల్ ఎఫ్ 1 టైర్లు విడుదల
వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రపంచ ప్రసిద్ధ 'గుడ్ ఇయర్' అమెరికా టైర్ల కంపెనీకి చెందిన అత్యున్నత నాణ్యత, హయ్యర్ పెర్ఫార్మెన్స్ కలిగిన కొత్త 'ఈగల్ ఎఫ్ 1' టైర్లను శనివారం వరంగల్ ఆఫీసర్స్ క్లబ్‌లో ఘనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి పీజీ గార్డెన్స్ అధినేత ప్రొద్దుటూరి రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా, విశ్రాంత ఆచార్యులు గడ్డం భాస్కర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. గుడ్ ఇయర్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రాంతీయ మేనేజర్ వడగ నాగరాజు, 'శ్రీ తిరుమల టైర్స్'...