వరంగల్‌లో డబ్యూడీటీఏ–2026 ఇంటర్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ టోర్నమెంట్ ప్రారంభం

  హనుమకొండ (వరంగల్ వాయిస్): క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదని, అవి యువతను క్రమశిక్షణతో కూడిన సన్మార్గంలో నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. వరంగల్ డిస్ట్రిక్ట్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఆఫీసర్స్ క్లబ్‌లో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన డబ్యూడీటీఏ–2026 అంతర్ జిల్లా టెన్నిస్ టోర్నమెంట్‌ను శనివారం ఆయన అధికారికంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డబ్యూడీటీఏ అధ్యక్షులు గండ్ర సత్యనారాయణ రెడ్డితో పాటు రవీందర్ రెడ్డి, మురుగన్, కన్నా రెడ్డి, టీ.బాబు...