WarangalVoice
Newspaper Banner
Date of Publish : 27 April 2026, 2:55 pm Digital Edition : Ravi Goli

వరంగల్ ఎలక్ట్రికల్ ఎస్సీ ఆనంద్‌కు సన్మానం

వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ ఎలక్ట్రికల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్సీ)గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అన్నిమల్లె ఆనందం గారిని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రౌతు రమేష్ కుమార్ సోమవారం ఘనంగా సత్కరించారు. హనుమకొండలోని ఎస్సీ స్వగృహంలో ఆయనను కలిసి, శాలువా కప్పి, మెమెంటో, బాబాసాహెబ్ అంబేద్కర్ గ్రంథాన్ని అందించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా రౌతు రమేష్ కుమార్ మాట్లాడుతూ, ఆనందం గారి సుదీర్ఘ అనుభవాన్ని కొనియాడారు. గతంలో ములుగు ఎస్సీగా పనిచేసిన కాలంలో మేడారం జాతరను విజయవంతం చేయడంలో ఆయన పోషించిన పాత్ర మరువలేనిదన్నారు. వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడంలో ఆనందం గారు సఫలీకృతులు కావాలని రమేష్ కుమార్ ఆకాంక్షించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనా విధానంతో, రాజ్యాంగం కల్పించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను కాపాడుతూ, విధులు నిర్వహించడంలో ఆదర్శంగా నిలవాలని ఈ సందర్భంగా ఎస్సీని కోరారు.