వాహనదారులు భద్రతా నియమాలు పాటించాలి
పర్వతగిరి సీఐ రాజగోపాల్ వరంగల్ వాయిస్, పర్వతగిరి : వాహనదారులు ప్రయాణ సమయంలో వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని పర్వతగిరి సీఐ రాజగోపాల్ సూచించారు. శుక్రవారం మండలంలోని అన్నారం గ్రామంలోని తెలంగాణ తల్లి సెంటర్ వద్ద ఎస్సై బి.ప్రవీణ్ కుమార్ తో కలిసి గ్రామ యువత, ప్రజలతో రోడ్డు భద్రతపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారు నడిపే వారు సీటు బెల్టు పెట్టుకోవాలని కోరారు. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ప్రతి...