విజయవంతమైన అరుదైన శస్త్రచికిత్స
అతుక్కున్న కిడ్నీలను వేరు చేసిన వైద్యులు వరంగల్ వాయిస్, హనుమకొండ : హనుమకొండలోని శ్రీ శ్రీనివాస కిడ్నీ సెంటర్‌లో వైద్యులు అత్యంత అరుదైన, క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. 12 సంవత్సరాల బాలుడికి ఎడమ కిడ్నీ కుడి వైపునకు ఉండడంతో పాటు, రెండు కిడ్నీలు అతుక్కుపోయి ఉన్న సమస్యను లాప్రోస్కోపిక్ పద్ధతిలో విజయవంతంగా తొలగించినట్లు ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ ఏ.రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ మండలం కాప్రాకు చెందిన సబ్బాని పూర్ణచంద్ర (12) అనే బాలుడు తీవ్రమైన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు....