విద్యార్థులకు ‘ప్రగతి పత్రాల’ పంపిణీ
వరంగల్ వాయిస్, నల్లబెల్లి : నల్లబెల్లి మండలం నాగరాజుపల్లి గ్రామ పరిధిలోని పంతులుపల్లి ప్రాథమిక పాఠశాలలో 2025-2026 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఫలితాల ప్రగతి పత్రాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కర్ణకంటి రాంమూర్తి, ఉపాధ్యాయులు కునమల్ల రాజన్ బాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నాగరాజుపల్లి గ్రామ సర్పంచ్ ఎరుకల లలిత ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు ఫలితాలను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఎరుకల లలిత మాట్లాడుతూ.. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రమశిక్షణను అలవర్చుకోవాలని, శ్రద్ధాసక్తులతో చదువుకోవాలని పిలుపునిచ్చారు....