విద్యుత్ కార్మికుల పోరాటానికి బీజేపీ సంపూర్ణ మద్దతు
చందుపట్ల కీర్తి రెడ్డి కేటీపీపీ సమ్మె శిబిరంలో బీజేపీ నేతల ధర్నా టెంట్ వేయనివ్వకపోవడంపై ఆగ్రహం గణపురం (వరంగల్ వాయిస్): తమ న్యాయమైన డిమాండ్ల సాధనకై చెల్పూర్ కేటీపీపీ వద్ద సమ్మె నిర్వహిస్తున్న విద్యుత్ ఆర్టిసన్, అన్-మ్యాన్డ్ పీస్ రేట్ కార్మికులకు బీజేపీ అండగా నిలిచింది. శనివారం నిర్వహించిన సమ్మెలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తి రెడ్డి, భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు ఏడునూతల నిషిధర్ రెడ్డి ప్రత్యక్షంగా పాల్గొని, కార్మికులతో కలిసి కూర్చొని తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా...