విధి నిర్వహణలో ప్రతిభ
సీఐ విశ్వేశ్వర్‌కు సీపీ ప్రశంసలు వరంగల్ వాయిస్, గీసుగొండ : తన విధుల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశంలో, వరంగల్ పోలీస్ కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని, నగదు పురస్కారాన్ని స్వీకరించారు. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులైన గుట్కా, తంబాకు విక్రయాలపై సీఐ విశ్వేశ్వర్ కఠిన చర్యలు తీసుకున్నారు. అక్రమ రవాణా, విక్రయాలను...