WarangalVoice
Newspaper Banner
Date of Publish : 03 August 2026, 2:46 pm Digital Edition : Ravi Goli

వృద్ధురాలికి గ్యాస్ స్టవ్ పంపిణీ

వరంగల్ వాయిస్, కరీమాబాద్ : వరంగల్ రామన్నపేటలోని ‘డా. ఎ.రాజేంద్రప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్’ ఆధ్వర్యంలో మరోసారి సేవాగుణం చాటుకున్నారు. రామన్నపేటకు చెందిన వృద్ధురాలు పుల్లూరు కీర్తి మాల వంట చేసుకోవడానికి స్టవ్ లేక ఇబ్బందిపడుతున్న విషయాన్ని స్థానికులు ట్రస్ట్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించిన ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు వెంటనే స్పందించి, ఆమెకు నూతన గ్యాస్ స్టవ్‌ను అందజేయాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆమె ఇంటికి వెళ్లి నూతన గ్యాస్ స్టవ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ డా. ఎ. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. “ఇటువంటి వృద్ధులను, అనాథలను, అభాగ్యులను ఆదరించి వారికి కావలసిన సహాయం అందించడంలో వచ్చే ఆనందం వర్ణనాతీతం” అని పేర్కొన్నారు. తమ కష్టాన్ని గుర్తించి గ్యాస్ స్టవ్ అందజేయడంతో వృద్ధురాలు కీర్తి మాల ఆనందం వ్యక్తం చేస్తూ ట్రస్ట్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఆర్గనైజర్ శ్రవణ్, సభ్యులు తాటిపల్లి ప్రకాష్, మిట్టపల్లి సమ్మయ్య, రామ శ్రీనివాస్, సత్యం తదితరులు పాల్గొన్నారు.