వృద్ధులతో రాఖీ పండుగ జరుపుకున్న ఎస్సై సతీష్
స్వయంకృషి వృద్ధాశ్రమంలో అన్నదానం చేసిన ఎస్సై సతీష్ వరంగల్ వాయిస్, హనుమకొండ : రాఖీ పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని హనుమకొండ సబ్-ఇన్‌స్పెక్టర్ కె. సతీష్ సామాజిక సేవా కార్యక్రమంలో భాగంగా స్వయంకృషి వృద్ధాశ్రమాన్ని సందర్శించి, అక్కడి వృద్ధులకు అన్నదానం నిర్వహించారు.ఈ సందర్భంగా సబ్-ఇన్‌స్పెక్టర్ కె. సతీష్ వృద్ధులకు స్వయంగా ఆహారాన్ని అందజేసి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వృద్ధులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి అవసరాలు, సమస్యలను తెలుసుకున్నారు.వయోవృద్ధులకు అండగా నిలవడం, ఆప్యాయతతో పలకరించడం, అవసరమైన సమయంలో సహాయం అందించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత...