వైభవంగా బీరన్న కుంట బొడ్రాయి ద్వితీయ వార్షికోత్సవం

భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు భారీగా తరలివచ్చిన భక్తులు ఆధ్యాత్మిక శోభితం వరంగల్ వాయిస్, హనుమకొండ : స్థానిక బీరన్న కుంట ప్రాంతంలో వెలసిన బొడ్రాయి రెండవ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. బొడ్రాయి ప్రతిష్టించి రెండు ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్థానిక భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే బొడ్రాయి వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అర్చకుల వేదమంత్రాల మధ్య బొడ్రాయికి అభిషేకాలు, అలంకరణలు మరియు శాంతి పూజలు నిర్వహించారు....