వైభవంగా ‘సైలానీ బాబా’ గంధం జాతర

వరంగల్ వాయిస్, దామెర : మండల పరిధిలోని ఒగ్లాపూర్ గ్రామంలో వెలసిన హజ్రత్ సైలానీ బాబా దర్గా గంధం జాతర ఆదివారం అత్యంత అట్టహాసంగా ప్రారంభమైంది. కులమతాలకు అతీతంగా సాగే ఈ వేడుకను వీక్షించేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ వంటి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చారు. జాతరలో ప్రధాన ఘట్టమైన గంధం ఊరేగింపు ఆదివారం అర్ధరాత్రి వైభవంగా సాగింది. ఒంటెపై గంధాన్ని ఉంచి దర్గా పరిసరాల్లో ఊరేగించారు. అనంతరం బాబా సమాధిపై గంధాన్ని లేపనం...