సబ్ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్

మహిళలపై లైంగిక దాడులు, బెదిరింపుల కేసు వరంగల్ వాయిస్, సుబేదారి: సోషల్ మీడియా వేదికగా మహిళలతో పరిచయాలు పెంచుకొని, వారిని నమ్మించి లైంగికంగా వేధించడం, బలవంతపు శారీరక సంబంధాలకు పాల్పడటం, బెదిరింపులకు దిగడం వంటి తీవ్ర నేరాలకు పాల్పడిన సబ్ ఇన్‌స్పెక్టర్ కదిరే శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సుబేదారి పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం.రంజిత్ కుమార్ తెలిపారు. నిందితుడు కదిరే శ్రీకాంత్ (38) రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలానికి చెందినవాడు. వివాహితుడైన అతను 2014 బ్యాచ్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా వివిధ...