సమాజ సేవలో విద్యుత్ ఉద్యోగులు
చలివేంద్రాన్ని ప్రారంభించిన సీఎండీ కర్నాటి వరంగల్ వాయిస్, హనుమకొండ : నివాసాల్లో వెలుగులు ప్రసరింపజేయడమే కాకుండా, పేదలు, దివ్యాంగులు, అనాథల జీవితాల్లోనూ వెలుగులు నింపడమే లక్ష్యంగా విద్యుత్ ఉద్యోగులు పనిచేస్తున్నారని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి కొనియాడారు. హోప్ ఫుల్ హార్ట్ సొసైటీ ఆధ్వర్యంలో హన్మకొండ నక్కలగుట్టలోని సూపరింటెండింగ్ ఇంజనీర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. బాటసారుల దాహార్తిని తీర్చడానికి ప్రతి ఏటా క్రమం...