సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం ఎమ్మెల్యేకు వినతి

వరంగల్ వాయిస్, దామెర: పరకాల నియోజకవర్గంలోని తక్కళ్లపహాడ్ గ్రామంలో అస్తవ్యస్తంగా మారిన రహదారులకు మోక్షం కల్పించాలని, సీసీ రోడ్లతో పాటు పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ దాడి వసంత స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు బురదమయమైన దారులతో నానా అవస్థలు పడుతున్నారని ఆమె వివరించారు. ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని...