సైబర్ నేరాలపై అవగాహన సదస్సు

అప్రమత్తంగా ఉండాలని ఎస్సై వీరభద్రరావు పిలుపు వరంగల్ వాయిస్, దామెర : మండలంలోని ఊరుగొండ గ్రామంలోని రైతు వేదికలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో “సురక్షా కా తిరంగా – సైబర్ ఇండిపెండెంట్ తెలంగాణ” కార్యక్రమంలో భాగంగా గురువారం సైబర్ అవగాహన సదస్సు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన దామెర పోలీస్ స్టేషన్ ఎస్సై వీరభద్రరావు గ్రామీణులు, డ్వాక్రా మహిళలు, విద్యార్థులను ఉద్దేశించి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. నేటి ఆధునిక కాలంలో సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో...