సైబర్ నేరాల నివారణకు ప్రజల్లో అవగాహన,అప్రమత్తమే కీలకం : వరంగల్ సీపీ శ్వేత

వరంగల్ వాయిస్, క్రైం :సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెంపొందించి, వారిని అప్రమత్తం చేయాలనే లక్ష్యంతో వరంగల్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ ఏసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం కేయూ జంక్షన్ నుంచి హనుమకొండ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు “ఫ్లాష్ వాక్” నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ ముఖ్య అతిధిగా పాల్గొని విద్యార్థులతో కలిసి నడిచారు. వివిధ కళాశాలలకు చెందిన సుమారు 1,200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొనగా, సైబర్ నేరాల...